వైద్య కోటా పెంపుపై హైకోర్టు స్టే
హైదరాబాద్: ప్రైవేట్ వైద్య కళాశాలల్లో యాజమాన్యపు కోటాను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై రాష్ట్ర హైకోర్టు గురువారం స్టే ఇచ్చింది. ప్రైవేట్ వైద్య కళాశాలల్లో యాజమాన్యం కోటాను ప్రభుత్వం 25 శాతం నుంచి 40 శాతానికి పెంచింది. యాజమాన్యం కోటా పెంపు వల్ల మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని విమర్శిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై హైకోర్టు మేనేజ్ మెంటు కోటా పెంపును నిలిపేస్తూ తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది.
యాజమాన్యం కోటా పెంపు ఈ విద్యా సంవత్సరానికి వర్తించదని హైకోర్టు స్పష్టం చేసింది. యాజమాన్యం కోటా సీట్లను యాజమాన్యాలు 40 నుంచి 50 లక్షలకు విక్రయించుకున్నట్లు తెలుస్తోంది. కోటా పెంపులో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని కూడా పిటిషనర్ ఆరోపించారు.












Click it and Unblock the Notifications