హైదరాబాద్: గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టిందో చెప్పాలని తెలుగుదేశం, ప్రజారాజ్యం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రభుత్వాన్ని నిలదీశాయి. గల్ఫ్ బాధితులకు అందించిన సహాయంపై ప్రతిపక్షాలు సోమవారం శాసనసభలో చర్చకు లేవనెత్తాయి. గల్ఫ్ బాధితులకు బడ్జెట్‌తో నిధులు కేటాయించాలని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేయగా, వారికి పునరావాసం, ఉపాధి మేళాలు నిర్వహిస్తున్నామని మంత్రి కితాబిచ్చారు. గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు స్పష్టమైన హామీ ఇవ్వాలని ప్రజారాజ్యం డిమాండ్ చేసింది.