మెట్రో రైలు ప్రాజెక్టు: మేటాస్ కు ఊరట
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణ సంస్థ మేటాస్ కు రాష్ట్ర హైకోర్టులో మంగళవారం ఊరట లభించింది. మేటాస్ బ్యాంక్ గ్యారంటీ సొమ్మును స్వాధీనం చేసుకోవాలనే ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు స్టే ఇచ్చింది. తుది ఉత్తర్వులకు లోబడే మెట్రో రైలు ప్రాజెక్టు టెండర్లు ఉండాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. సత్యం వివాదంలో మరో పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది.
మేటాస్ ఇచ్చిన 70 కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారంటీని స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంపై హైకోర్టు స్టే ఇచ్చింది. మేటాస్ తో కుదుర్చుకున్న హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు కాంట్రాక్టును ప్రభుత్వం ఇటీవల రద్దు చేసుకుంది. దీంతో బ్యాంక్ గ్యారంటీని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు తాజాగా టెండర్లు పిలవాలని కూడా నిర్ణయించింది.












Click it and Unblock the Notifications