చంద్రబాబును కలిశా: దేవేందర్

ప్రజారాజ్యం పార్టీని వీడిపోయే విషయంపై ఇప్పటి వరకు ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. తాను చిన్న పిల్లవాడిని కాదని, ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు. దేవేందర్ గౌడ్ ప్రజారాజ్యం పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరే విషయం దాదాపుగా ఖరారైనట్లు చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రజారాజ్యం పని చేయాలని దేవేందర్ గౌడ్ సూచిస్తున్నారు. దీనికి ప్రజారాజ్యం అధినేత చిరంజీవి అంగీకరించడం లేదు. ఇదే కారణంపై దేవేందర్ గౌడ్ ప్రజారాజ్యం పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరో రెండు మూడు రోజులు ఆయన తెలుగుదేశం పార్టీలో చేరే విషయం వాయిదా పడినట్లు ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications