గ్రేటర్ ఎన్నికలపై హైకోర్టు స్టే
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై హైకోర్టు స్టే మంజూరు చేస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాతనే ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. బీసి రిజర్వేషన్లు, డివిజన్ల విభజన సరిగా జరగలేదని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లను పరిశీలించిన తర్వాత హైకోర్టు హైదరాబాద్ ఎన్నికలపై స్టే ఇచ్చింది. కేసు విచారణను ఆగస్టు మూడో వారానికి వాయిదా వేసింది.
బీసీ గణనలో క్రీమీలేయర్ ను పాటించడం తప్పనిసరి అని, దాన్ని పాటించిన తర్వాతనే ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు తెలిపింది.బీసీ గణన సరిగా జరగలేదని హైకోర్టు అభిప్రాయపడింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కూడా సుప్రీంకోర్టులో కేవియట్లు వేయడానికి సిద్ధపడుతున్నారు.












Click it and Unblock the Notifications