మన్మోహన్ జవాబుపై వెంకయ్య ధ్వజం

Venkaiah Naidu
నెల్లూరు: భారత - పాకిస్తాన్ లు చేసిన సంయుక్త ప్రకటనపై ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పార్లమెంటులో ఇచ్చిన వివరణపై బిజెపి సీనియర్ నేత ఎం. వెంకయ్యనాయుడు తీవ్రంగా ధ్వజమెత్తారు. ఉగ్రవాద సమస్య పరిష్కారం కాకుండా పాక్ తో దౌత్యసంబంధాలు నెరిపే సంయుక్త ప్రకటనపై యుపిఎ ప్రభుత్వం పునసమీక్షించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పార్లమెంటులో చేసిన ప్రకటనపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఉగ్రవాదంతో సంబంధం లేకుండా పాకిస్తాన్ తో చర్చలు కొనసాగాలని, ఈ రెండింటికీ ముడి పెట్టడం సరికాదని అనడాన్ని దిగజారుడు దౌత్యనీతిగా ఆయన అభివర్ణించారు.

నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలపై పార్లమెంటు సమావేశాల అనంతరం దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. పొంతన లేని ప్రకటనలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఉత్పత్తి, డిమాండ్ లను బట్టి ఏ సరుకు కూడా కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన అన్నారు. ఎన్నికల్లో ప్రజలకు చేసిన వాగ్దానాలను ప్రభుత్వం మరిచిపోయిందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+