గుంటూరు: గుంటూరు జిల్లా పొన్నూరు మండలం పిపి పర్రులో పెళ్లి ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మహిళలు మరణించారు. పలువురు గాయపడ్డారు. ముగ్గురు మహిళలు కూడా అక్కడికక్కడే మృతి చెందారు. దాదాపు పది మంది గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిని 108 వాహనంలో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.