ఖైదీల విడుదల జీవోపై స్టేకు నిరాకరణ

ఆగస్టు 15వ తేదీన ఖైదీల విడుదలకు ప్రభుత్వం మార్గ దర్శక సూత్రాలను రూపొందించింది. ఈ మార్గ దర్శక సూత్రాల ప్రకారం తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యుడు పరిటాల రవి హత్య కేసు నిందితుడు మద్దెలచెర్వు సూరి విడుదలయ్యే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే, కొంత మంది మావోయిస్టు ఖైదీలు కూడా విడుదల కావచ్చునని అంటున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది.












Click it and Unblock the Notifications