హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంబిఎ చదువుతున్న విద్యార్థి శంకర్ ఆంధ్ర మహిళా సభ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించాడు. అయితే అతను బ్రెయిన్ ట్యూమర్ వల్ల మరణించాడని ఆంధ్ర మహిళా సభ ఆస్పత్రి వైద్యులు చెప్పారు. కాగా, అతను స్వైన్ ఫ్లూతో మరణించి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. దీంతో నమూనాలను వైద్య పరీక్షల కోసం పంపారు. శంకర్ కరీంనగర్ కు చెందినవాడు.