కరవుపై రాజకీయం వద్దు: బాబు

Chandrababu Naidu
హైదరాబాద్: కరవును రాజకీయం చేయవద్దని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం శాసనసభలో ప్రభుత్వాన్ని కోరారు. కరవు ప్రాంతాలను ప్రకటించే విషయంలో ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో జాప్యం జరిగితే కేంద్రం నుంచి సాయం ఎలా అందుతుందని ఆయన అడిగారు. మన కన్నా ఎక్కువ వర్షపాతం ఉన్న రాష్ట్రాలు కరవు ప్రాంతాలను ప్రకటించాయని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రాన్ని కరవు ప్రాంతంగా ప్రకటించే విషయంలో భేషిజాలు అక్కరలేదని ఆనయ అన్నారు.

ప్రస్తుత కరవు పరిస్థితిలో అందరం ప్రజలకు బాసటగా నిలవాలని ఆయన సూచించారు. వాతావరణ పరిస్థితులను ఎవరూ నియంత్రించలేరని ఆయన అన్నారు. రైతుల రుణాలను మాఫీ చేయాలని పంట నష్టపోయిన రైతులకు బీమా వర్తింపజేయాలని ఆయన కోరారు. వ్యవసాయానికి పగటి పూట రోజుకు 9 గంటలు విద్యుత్ అందించాలని ఆయన డిమాండ్ చేశారు.

రైతులకు 95 శాతం సబ్సిడీతో ఎరువులు అందించాలని, నీటీ తీరువాను రద్దు చేయాలని ఆయన కోరారు. ప్రతి మండలానికి మంచి నీటి సరఫరా కోసం 50 లక్షల రూపాయలు కేటాయించాలని ఆయన కోరారు. విద్యార్థులకు ఇస్తున్న ఉపకార వేతనాలను పెంచాలని ఆయన కోరారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ వర్తింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+