డెహ్రాడూన్: డెహ్రాడూన్ లో 24 విద్యార్థి స్వైన్ ఫ్లూతో మరణించినట్లు అనుమానిస్తున్నారు. అతడు పూణే నుంచి ఇక్కడికి వచ్చాడని వైద్యులు బుధవారం చెప్పారు. రేస్ కోర్సు ప్రాంతానికి చెందిన రౌనక్ సింగ్ స్వైన్ ఫ్లూ లక్షణాలతో సోమవారం ఆస్పత్రి పాలయ్యాడు. అయితే అతని పరిస్థితి క్రమక్రమంగా క్షీణిస్తూ వచ్చింది.
సింగ్ పూణేలో బిటెక్ చదువుతున్నాడు. సింగ్ స్వైన్ ఫ్లూతో మరణించాడా, లేదా అనేది నిర్ధారణ కాలేదని, నమూనాలను పరీక్షలకు పంపామని వైద్యులు చెప్పారు. ముందు జాగ్రత్త చర్యగా సింగ్ బంధువుల నమూనాలను కూడా పరీక్షలకు పంపారు.