న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 24 గంటల వ్యవధిలో రెండు స్వైన్ ఫ్లూ మరణాలు సంభవించాయి. 31 ఏళ్ల పురుషుడు, 38 ఏళ్ల మహిళ ఢిల్లీలో స్వైన్ ఫ్లూతో మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు గురువారం చెప్పాయి. సామ్రాట్ పాండ్యా అనే 31 ఏళ్ల వ్యక్తి గురువారం రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో మరణించాడు. అతను గుర్గావ్ కు చెందినవాడు. అతన్ని వెంటిలేటర్ పై ఉంచారు. అయితే గుండె, ఊపిరితిత్తులు పని చేయకపోవడంతో ఆతను మరణించినట్లు ఆస్పత్రి వైద్య సూపరింటిండెంట్ ఎన్ కె చదుర్వేది చెప్పారు.
38 ఏళ్ల మహిళ రేణు గుప్తా బుధవారం రాత్రి మరణించింది. తన కుమారుడు వైద్యుల నిర్లక్ష్యం వల్లనే మరణించాడని సామ్రాట్ తండ్రి ఆరోపిస్తున్నాడు. ఢిల్లీ మరణాలతో దేశంలో స్వైన్ ఫ్లూ మరణాల సంఖ్య మరింత పెరిగింది.