హైదరాబాద్: మగధీర సినిమా విజయమే తాను తన తండ్రి చిరంజీవికి ఇచ్చే జన్మదిన కానుక అని తెలుగు సినీ హీరో రామ్ చరణ్ తేజ అన్నారు. మగధీర హిట్టే తనకు జన్మదిన కానుక అని తన తండ్రి నిన్ననే చెప్పినట్లు ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. చిరంజీవి కుమారుడినని చెప్పుకోవడానికి తనకు గర్వంగా ఉందని ఆయన అన్నారు.
చిరంజీవి సినిమాల్లో తిరిగి నటించాలని తానూ కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. మగధీర విజయాన్ని తాను ఎంజాయ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తన తండ్రికి కానుక తేవడానికి ఇప్పుడే బయటకు వెళ్తున్నానని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.