హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలోని సిగ్మా ప్రైవేట్ ఆస్పత్రిలో ఓ నర్సు బుధవారం ఆత్మహత్య చేసుకుంది. ఆమె ను కేరళలోని త్రివేండ్రంకు చెందిన శ్రీజగా గుర్తించారు. ఆమె ఈ ఆస్పత్రిలోనే నర్సుగా పనిచేస్తోంది. ఆస్పత్రిలోని గదిలో ఆమె అధిక మోతాదులో మత్తు ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకుంది.
శ్రీజ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టు మార్టం నిమిత్తం ఆమె శవాన్ని ఆస్పత్రికి తరలించారు.