అదనపు డిజి దూబే సస్పెండ్

ఐపీఎస్ అధికారులెవ్వరూ ఇతర రాష్ట్రాల్లోని తమ ఇళ్లలో పనిచేయడానికి కానిస్టేబుళ్లను పంపేందుకు నిబంధనలు అంగీకరించవన్నారు. సీపీఎల్ కమాండెంట్ ఎస్పీ స్థాయి అధికారేనని, ఇతర రాష్ట్రాలకు డ్యూటీపై కానిస్టేబుళ్లను పంపించే అధికారం ఆయనకు లేదని, డీఐజీ స్థాయి అధికారులే ఆ అధికారం కలిగి ఉంటారని స్పష్టం చేశారు.
అఖిల భారత సర్వీసు ఉద్యోగుల (క్రమశిక్షణ, అప్పీల్) నిబంధనలు 3(1) ప్రకారం వివేక్‌దూబే, అబ్రహం లింకన్ లను సస్పెండ్ చేస్తున్నామని, వీరిపై శాఖాపరమైన విచారణ జరుగుతున్నందున తదుపరి చర్యలు తీసుకుంటామని రాజకీయ వ్యవహారాల ముఖ్యకార్యదర్శి గోనెల రాజేంద్రమోహన్ ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదనపు డీజీ స్థాయి అధికారి ఒకరు సస్పెండ్ కావడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం.