గుజరాత్ లో పటేల్ వ్యతిరేక పుస్తకం

ఆ పుస్తకం గురించి ముఖ్యమంత్రి మోడీకి తెలియదనుకోవడం పొరపాటే. ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి ఆయన తరుచూ వెళ్తుంటారు. 1967 నుంచి 1980 వరకు ఆయన ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గా ఉన్నారు. పైగా ఆయనకు పుస్తక పఠన ప్రీతి కూడా ఎక్కువే. శేషాద్రి రాసిన పుస్తకం 1982 తర్వాతనే ప్రచురితమైనప్పటికీ ఆయనకు ఆ పుస్తకం గురించి తెలియదని అనుకోలేం.
ఆ పుస్తకం పేరు ది ట్రాజిక్ స్టోరీ ఆఫ్ పార్టిషన్. దేశ విభజనకు నెహ్రూ, పటేల్ కారణమని శేషాద్రి తన పుస్తకంలో రాశారు. అదే విషయాన్ని జస్వంత్ సింగ్ తన పుస్తకం జిన్నాః ఇండియా, ఇండిపెండెన్స్, పార్టీషన్ అనే పుస్తకంలో రాశారు.












Click it and Unblock the Notifications