వైయస్ ఆడుకుంటున్నారు: బాబు

చంద్రబాబు వ్యాఖ్యలకు శాసనసభా వ్యవహారాల మంత్రి కె.రోశయ్య తీవ్రంగా ప్రతిస్పందించారు. వాయిదా తీర్మానాలు కూడా లేకుండానే చంద్రబాబు ఆ వ్యవహారాన్ని లేవనెత్తడమేమిటని ఆయన ప్రశ్నించారు. స్పీకర్ ను కించపరుస్తూ మాట్లాడే పార్టీ తెలుగుదేశం అని, ఆ పార్టీకి మాట్లాడే అర్హత లేదని ఆయన అన్నారు. ఆ తర్వాత ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమైంది. దీనికి ముందు ప్రతిపక్షాలు ప్రతిపాదించిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తోసిపుచ్చారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై ప్రజారాజ్యం పార్టీ, కల్లుగీత కార్మికుల సమస్యలపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), ఉద్యోగులకు పిఆర్సీ, ఉద్యోగుల క్రమబద్దీకరణపై బిజెపి వాయిదా తీర్మానాలను ప్రతిపాదించాయి.












Click it and Unblock the Notifications