శ్రీవారికే భద్రతకే ముప్పు: బాబు

టిటిడి వ్యవహారాలపై సభా సంఘం వేయాలని ప్రతిపక్షాలన్నీ డిమాండ్ చేశాయి. టిటిడి వ్యవహారాల్లో రాజకీయ జోక్యం కూడదని సిపిఎం శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి కోరారు. టిటిడి పాలక మండలి చైర్మన్ గా రాజకీయ నాయకడిని నియమించవద్దని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పాలకమండలిని రద్దు చేసి అవకతవకల విచారణకు సభా సంఘం వేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాల పవిత్రతను దెబ్బ తీసే విధంగా ప్రభుత్వం టిటిడి విషయంలో వ్యవహరిస్తోందని బిజెపి సభ్యుడు జి.కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి హిందూ దేవాలయాల్లో అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆయన విమర్శించారు. టిటిడి నిధులను ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు మళ్లిస్తోందని ఆయన అన్నారు. రాజకీయ నేతలకు దేవాలయ పాలక మండళ్లు పునరావాసంగా మారుతున్నాయని ఆయన అన్నారు. ఆదికేశవులు నాయుడు టిటిడి చైర్మన్ అయిన తర్వాత తిరుమల పవిత్రత పూర్తిగా దెబ్బ తిన్నదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications