హైదరాబాద్: వచ్చే 24 గంటల్లో రాష్ట్రంలోని కోస్తాంధ్ర, తెలంగాణల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఓ మోస్తరుగా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. విశాఖపట్నం వాతావరణ పరిశోధనా కార్యాలయం అధికారులు ఆ విషయం చెప్పారు.
ఉపరితల ద్రోణి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వారంటున్నారు. రేపటి లోగా ఉపరితల ద్రోణి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ పరిశోధన కార్యాలయం అధికారులు చెప్పారు.