టిటిడిపై ప్రతిపక్షాల వాకౌట్

రాష్ట్రంలోని దేవాలయాల ఆస్తుల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. తిరుపతిలోని ఒక్క కోదండ రామస్వామి ఆలయం నగలను తాకట్టు పెడితే దాన్ని టిటిడి మొత్తానికి ఆపాదించడం మంచిది కాదని ఆయన అన్నారు. టిటిడి పాలక మండలిని రద్దు చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. కలియుగ దైవమైన వేంకటేశ్వర స్వామి మీద భక్తి తగ్గించే విధంగా సభ్యులు వ్యాఖ్యలు చేయడం సరి కాదని అన్నారు. దానిపై ప్రభుత్వ వైఫల్యం ఏమీ లేదని, తాము పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని మంత్రి చెప్పారు. వ్యవహారాన్ని రాజకీయం చేయవద్దని ఆయన సూచించారు. దేవాలయాలకు చెందిన నగలు, స్థలాలు, పొలాలు, ఇతర ఆస్తుల వివరాలు అన్నింటినీ వైబ్ సైట్ లో ఉంచుతామని ఆయన అన్నారు. అక్టోబర్ 2వ తేదీన వెబ్ సైట్ ను ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications