రాజకీయ విమర్సలు వద్దు: బాబు

కోదండరామస్వామి ఆలయంలో శ్రీవారి నగలను పూజారి తాకట్టు పెట్టిన వ్యవహారంపై తమ దృష్టికి రాగానే వెంటనే చర్యలు చేపట్టామని, ప్రభుత్వం కచ్చితంగా, సమర్థంగా వ్యవహరించిందని ఆయన చెప్పారు. నగలను కుదవ పెట్టిన పూజారినే కాకుండా కుదువ పెట్టుకున్నవారిని కూడా అదుపులోకి తీసుకున్నామని ఆయన చెప్పారు. భక్తులు వేంకటేశ్వరస్వామిపై భక్తితో కోట్లాది రూపాయలు సమర్పిస్తున్నారని, అవి దుర్వినియోగం కాకుండా చూస్తున్నామని ఆయన చెప్పారు. దేశంలోని అన్ని ఆలయాల్లో కన్నా తిరుమలలోనే సౌకర్యాలు బాగా ఉన్నాయని, రోజుకు 70-80 వేల మంది భక్తులు వస్తారని, వారందరికీ సౌకర్యాలు కల్పించడం చిన్న విషయమేమీ కాదని, కానీ ఆ విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం సమర్థంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications