జస్వంత్ తో సుష్మా స్వరాజ్ భేటీ
న్యూఢిల్లీ: బహిష్కృత నేత జస్వంత్ సింగ్ ను బిజెపి సీనియర్ నేత సుష్మా స్వరాజ్ ఆయన నివాసంలో సోమవారం కలిశారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పిఎసి) చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని సుష్మా జస్వంత్ ను అడిగినట్లు సమాచారం. జిన్నాను ప్రశంసిస్తూ పుస్తకం రాసినందుకు జస్వంత్ ను పార్టీ బహిష్కరించింది. బహిష్కరణకు గురైన తర్వాత జస్వంత్ ను ఒక బిజెపి నేత కలవడం ఇదే మొదటిసారి.
పిఎసి చైర్మన్ గా జస్వంత్ నియామకం జరిగి నెల రోజులు కూడా పూర్తి కాలేదు. బిజెపిలో ఉన్నప్పుడు జస్వంత్ పిఎసి చైర్మన్ గా నియమితులయ్యారని, అందువల్ల పార్టీతో సంబంధం తెగిపోయిన తర్వాత ఆయన ఆ పదవిలో కొనసాగకూడదని, జస్వంత్ రాజీనామా చేస్తే దాన్ని మరో బిజెపి సభ్యుడికి కేటాయిస్తామని బిజెపి నాయకులంటున్నారు.












Click it and Unblock the Notifications