బాబు ఇక ఫినిష్: వైయస్

రోజా కాంగ్రెసు పార్టీలో చేరుతారనే విషయాన్ని తాను అప్పట్లోనే చెప్పానని ఆయన గుర్తు చేశారు. తాను చెప్పిందే జరిగిందని, అది నత విశ్వసనీయతకు నిదర్శనమని ఆయన అన్నారు. ప్రజల్లో మంచి పేరు ఉన్నవారినే తాము కాంగ్రెసులోకి తీసుకుంటామని ఆయన చెప్పారు. తనను మొండెద్దు అన్న చంద్రబాబు వ్యాఖ్యలపై ఆయన ప్రతిస్పందిస్తూ ఆ విషయాన్ని చంద్రబాబు విజ్ఞతకే వదిలేస్తున్నానని ఆయన చెప్పారు.
బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న తీరు పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చర్చ జరగకుండా ప్రతిపక్ష పార్టీయే అడ్డుకుంటోందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై గంటున్నర పాటు ప్రదాని మన్మోహన్ సింగ్ కు ప్రజంటేషన్ ఇస్తామని ఆయన చెప్పారు. కేజి బేసిన్ గ్యాస్ విషంయలో రాష్ట్ర వాటాపై కేంద్రంపై తాము ఎప్పటి నుంచో ఒత్తిడి తెస్తున్నామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications