సిఎం వైయస్ తో బొజ్జల భేటీ

తాను కాంగ్రెసులో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి ఖండించారు. తన నియోజకవర్గానికి రెండు ప్రాజెక్టులు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపేందుకే ముఖ్యమంత్రిని కలిసినట్లు ఆయన తెలిపారు. మర్యాదపూర్వకంగా జరిగిన భేటీని రాజకీయం చేయడం మంచిది కాదని ఆయన అన్నారు. తన నాయకుడు నారా చంద్రబాబు నాయుడికి చెప్పిన తర్వాతనే తాను ముఖ్యమంత్రిని కలిసినట్లు ఆయన తెలిపారు. తాను తెలుగుదేశంలోనే కొనసాగుతున్నట్లు ఆయన చెప్పారు ముఖ్యమంత్రి పేషీ ఆకర్షణకు కేంద్రం కాదన్నారు.












Click it and Unblock the Notifications