ముంబై: ముంబై శివారులోని అంధేరీ ప్రాంతలో కొండచరియలు విరిగి పడి 12 మంది మరణించినట్లు, 13 మంది గాయపడినట్లు పోలీసులు శుక్రవారం ఉదయం చెప్పారు. మృతుల్లో పిల్లలు కూడా ఉన్నారు. సకినాలోని ఎల్బీఎస్ నగర్ లో భారీ వర్షాలకు గురువారం రాత్రి కొండ చరియలు విరిగి పడ్డాయి. దీంతో 15 నుంచి 20 ఇళ్లు ధ్వంసమైనట్లు అదనపు పోలీసు కమిషనర్ అమిత్ గుప్తా చెప్పారు. శిథిలాల కింద మరింత మంది చిక్కి ఉండవచ్చునని ఆయన చెప్పారు. వాటిని తొలగించడానికి 12 ఫైర్ ఇంజిన్లను వినియోగించారు.
మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి అశోక్ చవాన్ లక్ష రూపాయలేసి ఎక్స్గ్ గ్రేషియా ప్రకటించారు. గాయపడినవారిలో ఒక్కొక్కరికి 25 వేల నుంచి 50 వేల వరకు నష్టపరిహారం చెల్లించనున్నట్లు ఆయన తెలిపారు.