హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి మృతికి నార్త్ అమెరికా తెలుగు సొసైటీ తన తీవ్ర సంతాపాన్ని ప్రకటించింది. వైయస్ కుటుంబ సభ్యులకు, సహచరులకు, మిత్రులకు, అనుచరులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ముఖ్యమంత్రితో పాటు మరణించిన మిగతావారికి కూడా తన సంతాపాన్ని వ్యక్తం చేసింది. డాక్టర్ రాజశేఖర రెడ్డి రైతులు, పేద ప్రజల ప్రగతికి నిరంతరం పాటు పడ్డారని ప్రశంసించింది. ముఖ్యమంత్రి మృతి రాష్ట్రానికి, దేశానికి తీరని లోటని అభిప్రాయపడింది.
వైయస్ ప్రజల హృదయాల్లో ఆచంద్రార్కం మిగిలిపోతారని తెలిపింది. అమెరికాలోని తెలుగు సమాజం యావత్తూ వైయస్ మృతికి సంతాపం ప్రకటించింది. ఎన్నారైలు విషాద సముద్రంలో మునిగిపోయారు.