హైదరాబాద్: హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన వైయస్ రాజశేఖర రెడ్డి సతీమణిని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అక్కున చేర్చుకుని ఓదార్చారు. వైయస్ కు శ్రద్ధాంజలి ఘటించడానికి సోనియాతో పాటు ప్రధాని మన్మోహన్ సింగ్, పార్లమెంటు సభ్యుడు రాహుల్ గాంధీ శుక్రవారం ఉచయం హైదరాబాదుకు చేరుకున్నారు. వారు ముగ్గురు వైయస్ పార్థివ శరీరంపై పుష్పగచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు.
రాష్ట్ర గవర్నర్ ఎన్డీ తివారి వైయస్ మృతదేహానికి నివాళులర్పించారు. కేంద్ర మంత్రులు చిదంబరం, షిండే, వీరప్ప మొయిలీ తదితరులు నివాళులర్పించారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వారు వైయస్ భౌతిక కాయానికి నివాళులర్పించారు.