డిజిపికి హెలికాప్టరా? బాబు మండిపాటు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అంత్యక్రియలకు హాజరుకావడానికి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో వందమందికి పైగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులతో పాటు ప్రతిపక్ష నాయకులైన చంద్రబాబు, చిరంజీవి ప్రత్యేక విమానంలో రేణిగుంట వచ్చారు. తర్వాత అధికారులు ఏర్పాటు చేసిన వాహనాల్లో ఇడుపులపాయకు బయలుదేరారు.
అయితే కడప దాటిన తరువాత రోడ్డుకు అడ్డంగా వాహనాలు పెద్ద సంఖ్యలో ఉండటంతో రెండు గంటలు నిరీక్షించి తిరుగుముఖం పట్టారు. రాత్రి 10.30కి తిరుపతి విమానాశ్రయం చేరుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీలపై చంద్రబాబు విరుచుకుపడ్డారు.
"ముఖ్యమంత్రి అంతిమ సంస్కారాలకు హాజరుకావాలని వందల మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రతిపక్ష నాయకులు వస్తే కనీసం ఆయన భౌతికకాయం వద్దకు కూడా మమ్మల్ని తీసుకెళ్లలేక పోయారు. ఏం చేస్తున్నారు మీరు..!" అంటూ చంద్రబాబు నిలదీశారు.












Click it and Unblock the Notifications