న్యూఢిల్లీ: రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించాలనే విషయంపై సీఎల్పీఅభిప్రాయం తీసుకోకుండా అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోదని కేంద్ర న్యాయ శాఖ మంత్రి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్పమొయిలీ స్పష్టం చేశారు.
సంతాప దినాలు ముగిసేవరకూ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ఎవరూ మాట్లాడరాదని ఆయన శనివారం ఇక్కడ ఆదేశించారు. ఏపార్టీ అయినా ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే స్పందించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.