హైదరాబాద్: సచివాలయం ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి శనివారం విధులకు హాజరయ్యారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మృతికి సంతాపం తెలుపుతూ విధులు నిర్వర్తించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సంక్షేమం కోసం రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి సచివాలయంలో విషాదాన్ని నింపింది. వైఎస్ తో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పలువురు ఉద్యోగులు కంటతడిపెట్టారు.