హైదరాబాద్: హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి మృతికి అమెరికాలోని తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం (టిడిఎఫ్) సంతాపం ప్రకటించారు. రాజశేఖర రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి సుబ్రహ్మణ్యం, పైలట్ భాటియా, కో పైలట్ సత్యనారాయణ రెడ్డి, భద్రతాధికారి వైస్లీ మరణాలకు టిడిఎఫ్ అమెరికా చాప్టర్ అధ్యక్షుడు విప్లవ పుట్టా సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.