హైదరాబాద్: నగరంలోని అమీర్ పేట ధరంకరం రోడ్డులో ఉన్న ముఖ్యమంత్రి రోశయ్య ఇంటివద్ద అదనపు బందోబస్తును ఏర్పాటు చేశారు. స్థానిక పోలీసులతో పాటు సీఎం భద్రతా సిబ్బంది ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. మొన్నటి వరకు ఆర్థిక మంత్రిగా ఉన్న రోశయ్య ఇంటి దగ్గర సాధారణ సెక్యూరిటీ ఉండగా, ప్రస్తుతం పెద్ద మొత్తంలో భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసి, పర్యవేక్షిస్తుండడంతో ఆమార్గంలో జన సంచారం కొంత తగ్గింది. పోలీసులు, సిబ్బంది, మీడియా సిబ్బంది వాహనాలతో ఆ ప్రాంతమంతా నిండి ఉంటోంది. మరోవైపు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ వారసుని ఎంపికపై రాజకీయాలు మారుతున్న తరుణంలో ఇక్కడ భద్రత మరింత పెంచేందుకు భధ్రతా విభాగం ఏర్పాట్లు చేస్తోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.