న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని సోమవారం రాజమండ్రి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ కలుసుకున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలను ఉండవల్లి ఆమెకు వివరించినట్టు తెలుస్తోంది. ఉండవల్లి దివంగత రాజశేఖరరెడ్డికి,కెవిపి రామచంద్రరావుకు మంచి మిత్రుడు. ఆయన సోనియాగాంధీ వద్ద ముఖ్యమంత్రిగా జగన్ అభ్యర్ధిత్వాన్ని సమర్ధించి ఉండవచ్చని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.