ఒంగోలు: ప్రకాశం జిల్లాలో మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. జిల్లాలోని సింగరాయకొండ మండలం కలికివాయి జాతీయ రహదారిపై ఈ ప్రమాదం సంభవించింది. చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న వోల్వో బస్సు మోటార్ సైకిల్ ను ఢికొట్టింది. ఈ ప్రమాదంలో మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తున్న ముగ్దురిలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, మరొకతను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ప్రమాదంలో బస్సు క్లీనర్ కూడా చనిపోయాడు.
మృతులు ముగ్గురు జరుగుమల్లి మండలం నందనవనం గ్రామానికి చెందినవారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.