రోశయ్యకు సహాయ నిరాకరణ

Rosaiah
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.రోశయ్యకు మంత్రుల నుంచి సహాయ నిరాకరణ ప్రారంభమైంది. చాలా మంది మంత్రులు కార్యాలయాలకు హాజరు కావడం లేదు. ముఖ్యమంత్రి ఏర్పాటు చేస్తున్న సమీక్షా సమావేశాలకు కూడా హాజరు కావడం లేదు. విధులకు హాజరువుతున్న ఒకే ఒక రాజకీయ నాయకుడు కె. రోశయ్య అని, ఈ విధమైన పరిస్థితిని తాను ఎప్పుడూ చూడలేదని, పాలనా యంత్రాంగం రాజకీయాలకు ఆటస్థలంగా మారిందని ఒక ఉన్నతాధికారి వ్యాఖ్యానించాడు. ఈ స్థితిలో పార్టీ చీలుతుందా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. వైయస్ జగన్ కు వ్యతిరేకంగా కుట్ర జరుగుతుందనే అనుమానంతో వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మీయ మిత్రుడు రామచందర్ రావు ఢిల్లీలోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

రోశయ్య 34 మంది మంత్రులతో ఆదివారంనాడు ప్రమాణ స్వీకారం చేశారు. అయిష్టంగా మంత్రులుగా ప్రమాణం చేసినవారు తాము వైయస్ జగన్ నాయకత్వంలో తప్ప మరొకరి నాయకత్వంలో పని చేయబోమని కచ్చితమైన సందేశాన్ని ఇస్తున్నారు. పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలపై జరిగిన సమీక్షా సమావేశానికి బుధవారం సంబంధిత మంత్రి జూపల్లి కృష్ణారావు డుమ్మా కొట్టారు. పౌర సరఫరాల కమిషనర్ సంజయ్ జాజూ కూడా హాజరు కాలేదు.

కరువు పరిస్థితిపై రోశయ్య సోమవారం సమీక్షా సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి ఎన్ రఘువీరా రెడ్డి దూరంగా ఉన్నారు. ఆ తర్వాతి రోజు మంగళవారం స్వైన్ ఫ్లూపై జరిగిన సమీక్షా సమావేశానికి ఆరోగ్య శాఖ మంత్రి డి. నాగేందర్ ఆలస్యంగా వచ్చారు. అంతే కాకుండా సమావేశం ముగియకుండానే వెళ్లిపోయారు. ఇదంతా రోశయ్యకు తీవ్రంగా మనస్తాపానికి గురి చేస్తున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+