మాయావతిపై సుప్రీం ఆగ్రహం

పన్ను చెల్లింపుదారుల డబ్బుల వినియోగించి విగ్రహాలు స్థాపించడానికి వీలు లేదని సుప్రీంకోర్టు మంగళవారం మాయావతి ప్రభుత్వాన్ని ఆదేశించింది. విగ్రహాల నిర్మాణాన్ని ఆపేయాలని కూడా ఆదేశించింది. నిర్మాణాలను నిలిపేయడానికి మాయావతి ప్రభుత్వం అంగీకరించింది. అయితే ఆచరణలో నిర్మాణాలను ఆపేయలేదు. దీనిపై సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్రంగా ప్రతిస్పందించింది. తమ ఆదేశాలను ఎందుకు ధిక్కరించారంటూ సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి షోకాజ్ నోటీసు జారీ చేసింది.












Click it and Unblock the Notifications