188కి చేరిన స్వైన్ మృతులు

ఆంధ్రప్రదేశ్ లో తాజాగా ఇద్దరు మరణించారు. దీంతో రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ మరణాల సంఖ్య 9కి చేరింది. స్వైన్ ఫ్లూ చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తున్నట్లు ముఖ్యమంత్రి కె. రోశయ్య ఆదివారం ప్రకటించారు. స్వైన్ ఫ్లూ రోగులకు ప్రైవేట్ ఆస్పత్రులు కూడా చికిత్స అందించాలని, అందుకయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని ఆయన చెప్పారు.
కర్నాటకలోని బెంగుళూర్ లో తాజాగా ఇద్దరు మరణించారు. 62 ఏళ్ల మహిళ ప్రైవేట్ ఆస్పత్రిలో మరణించగా, 44 ఏళ్ల పురుషుడు ప్రభుత్వ ఆస్పత్రిలో చనిపోయాడు. హుబ్లీ, గడగ్, గుల్బర్గాల్లో ఒక్కరేసి మరణించారు. దేశంలో తాజాగా 160 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications