దేశ భద్రతకు నక్సల్స్ ముప్పు: పిఎం

నక్సల్స్ సమస్యను కేవలం శాంతిభద్రతల సమస్యగానే చూడకూడదని, ప్రయత్నాలు ఎన్ని జరిగినప్పటికీ నక్సల్స్ కు గిరిజనుల నుంచి, నిరుపేదల నుంచి మద్దతు లభిస్తోందని ఆయన అన్నారు. నక్సల్స్ ప్రభావం పౌర సమాజంలోని కొన్ని వర్గాలు, మేధావి వర్గం, యువతలో ఉందని, ఇదంతా సమస్య సంక్లిష్టతకు దారి తీస్తోందని ఆయన అన్నారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఆయన సూచించారు.
ఈశాన్య రాష్ట్రాల్లో అస్సాం, మణిపూర్ ల్లో హింస ఆక్షేపణీయ స్థాయిలో ఉందని ఆయన అన్నారు. ఈశాన్య ప్రాంతంలో బలవంతపు వసూళ్లు జరుగుతున్నాయని ఆయన అన్నారు. మొత్తంగా ఈశాన్య రాష్ట్రాల్లో శాంతిభద్రతల పరిస్థితి కాస్తా మెరుగు పడిందని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications