శతాబ్ది చైర్ కారులో రాహుల్

Rahul Gandhi
న్యూఢిల్లీ: పొదుపు మంత్రంలో భాగంగా కాంగ్రెసు నేత రాహుల్ గాంధీ మంగళవారం శతాబ్ది ఎక్స్ ప్రెస్ చైర్ కారులో లూథియానాకు ప్రయాణం చేశారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ సోమవారం పొదుపు చర్యల్లో భాగంగా ఎకానమీ క్లాసులో ప్రయాణం చేసిన నేపథ్యంలో ఆమె కుమారుడు రాహుల్ కూడా అదే మార్గాన్ని ఎంచుకున్నారు. లూథియానాకు ఆయన మంగళవారం ఉదయం బయలుదేరారు.

రైల్వే స్టేషన్ లో ఆయన పూలమాలలను కూడా తిరస్కరించారు. అది ఎగ్జిక్యూటివ్ క్లాసులో ప్రయాణం చేసేవారికి మాత్రమేనని అంటూ ఆయన వాటిని తోసిపుచ్చారు. ఇతర ప్రయాణికులకు మాదిరిగానే తనకు ప్లాస్టిక్ కప్ లోనే నీళ్లు ఇవ్వాలని ఆదేశించారు. రాహుల్ తమతో పాటు ప్రయాణించడం తోటి ప్రయాణికులను ఆనందపరిచింది. తమ సమస్యలు వినిపించడానికి కూడా అవకాశం ఉంటుందని వారన్నారు. రాహుల్ కు రైలులో పరంథాస్, పెరుగు అన్నం, ఇడ్లి, వడ, ఫలాలు అందించనున్నట్లు రైల్వే అధికారులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+