సొహ్రబుద్దీన్ కేసు: ఎపి పోలీసులు?

Sohrabuddin
న్యూఢిల్లీ: సోహ్రబుద్దీన్ బూటకం ఎన్ కౌంటర్ లో ఆంధ్రప్రదేశ్ పోలీసుల పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు. సొహ్రబుద్దీన్ ఎన్ కౌంటర్ పై దర్యాప్తును సిబిఐ దర్యాప్తునకు అప్పగించాలని సొలిసిటర్ జనరల్ గోపాల్ సుబ్రమణ్యం సుప్రీంకోర్టును కోరారు. సోహ్రాబుద్దీన్ ఎన్ కౌంటర్ విషయంలో గుజరాత్ ప్రభుత్వం కావాలనే వాస్తవాలను తొక్కిపడుతుందనే ఉద్దేశంతో ఆయన సిబిఐ దర్యాప్తును కోరారు. ఈ కేసులో అమికస్ క్యూరీగా సుబ్రమణ్యం సుప్రీంకోర్టులో బుధవారం తన వాదనలు వినిపించారు.

గుజరాత్ ప్రభుత్వం దర్యాప్తు నిజాయితీగా జరగలేదని, పైగా చాలా వాస్తవాలను మిస్టరీగానే మిగిల్చిందని ఆయన అన్నారు. ఈ కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించడమే పరిష్కారమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఎన్ కౌంటర్ లో గుజరాత్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ పోలీసుల పాత్ర ఉన్నట్లు ఆరోపణలున్నాయని, ఈ ఆరోపణలకు రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తులో ఏ విధమైన సమాధానం లేదని ఆయన అన్నారు. హైదరాబాదు నుంచి సాంగ్లీకి లగ్జరీ బస్సులో వస్తుండగా మధ్యలో సొహ్రబుద్దీన్ ను, అతని భార్య కౌసర్ బీని పోలీసులు పట్టుకున్నారని, వారితో పాటు మరో వ్యక్తిని కూడా పోలీసులు పట్టుకున్నారని, అయితే అతను ఎవరనేది ఇప్పటి వరకు ధృవీకరించలేదని ఆయన అన్నారు. అతను కలీముద్దీనా,తులసీరాం ప్రజాపతియా అనేది తేల్చలేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+