పూణే: స్వైన్ ఫ్లూ వ్యాధికి పూణేలో తాజాగా మరో ముగ్గురు బలయ్యారు. దీంతో పూణేలో స్వైన్ ఫ్లూ మరణాల సంఖ్య 52కు చేరినట్లు ఆరోగ్య శాఖ అధికారులు శుక్రవారం వెల్లడించారు. ఆ ముగ్గురు గత రాత్రి వేర్వేరు ఆస్పత్రుల్లో మృత్యుబారిన పడ్డారు. ప్రభాకర్ గవ్డే (38), నరేష్ భాటియా (35), సాగర్ భలేరావు (7) స్వైన్ ఫ్లూతో మరణించినట్లు అధికారులు చెప్పారు.
చాలా కేసుల్లో రోగులు మృత్యువాత పడిన తర్వాత నమూనాల పరీక్షల నివేదికలు వస్తున్నాయి. వైరాలజీ జాతీయ సంస్థపై ఒత్తిడి పెరగడంతో నమూనాల పరీక్షల నిర్వహణలో జాప్యం జరుగుతోంది.