సిఎంగా జగన్ ను చూడాలి: కన్నా

జగన్ ను ఎప్పుడు ముఖ్యమంత్రిని చేస్తారని ప్రజలు తమను అడుగుతున్నారని ఆయన అన్నారు. పార్టీ అధిష్ఠాన వర్గానికి తమ అభిప్రాయం చెప్పాలని వారంటున్నట్లు ఆయన తెలిపారు. డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను నెరవేర్చేందుకు జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని వారన్నారు. మరో మంత్రి పితాని సత్యనారాయణ కూడా అదే అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆయన కూడా జగన్ ను పరామర్శించారు. తణుకు శాసనసభ్యుడు కారుమూరి నాగేశ్వరరావు కూడా జగన్ నాయకత్వాన్ని సమర్థించారు. రాష్ట్రానికి, పార్టీకి జగన్ నాయకత్వం అవసరం ఎంతో ఉందని కడప జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జ్యోతి రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications