జగన్ పై ఏమీ చెప్పను: కెకె

Keshava Rao
హైదరాబాద్: వైయస్ జగన్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై తానేమీ చెప్పబోనని, ఈ విషయంలో తన అభిప్రాయాన్ని పార్టీ అధిష్ఠాన వర్గానికి మాత్రమే చెప్తానని కాంగ్రెసు సీనియర్ నేత కె.కేశవరావు చెప్పారు. తాను ముఖ్యమంత్రి పదవి విషయంలో లాబీయింగ్ చేయడం లేదని, తాను ముఖ్యమంత్రి పదవికి రేసులో లేనని ఆయన స్పష్టం చేశారు. ఆయన మంగళవారంనాడు పార్టీ సీనియర్ నేతలు నేదురుమల్లి జనార్దన్ రెడ్డిని, జి. వెంకటస్వామిని కలుసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహారం పూర్తిగా అధిష్ఠాన వర్గం చేతిలోకి వెళ్లిందని, అధిష్ఠాన వర్గం తీసుకునే నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని కేశవ రావు చెప్పారు. వ్యవహారం అధిష్ఠాన వర్గం వద్ద పెండింగ్ లో ఉన్నందున బహిరంగంగా ఎవరూ మాట్లాడకపోవడం మంచిదని ఆయన అన్నారు. కొంత మంది నాయకులు కుట్ర జరుగుతోందంటూ బహిరంగ ప్రకటనలు చేయడం సరి కాదని, సంచలనం సృష్టించడానికి ప్రయత్నించడం కూడా మంచిది కాదని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక విషయంలో పార్టీ అధిష్ఠాన వర్గం ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటుందని ఆయన చెప్పారు. అధిష్ఠాన వర్గం నియంతలాగా వ్యవహరించబోదని ఆయన చెప్పారు. రాష్ట్ర, జాతీయ ప్రయోజనాలను, పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వ్యవహరిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. తాను హైదరాబాదుకు ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో మంతనాలు జరపడానికి రాలేదని, మామూలుగానే వచ్చానని, అలా వచ్చినప్పుడు మిత్రులను కలుసుకోకుండా ఉండలేనని ఆయన అన్నారు. పార్టీ కలిసికట్టుగా ఉందని, కలిసికట్టుగా ఉంటుందని ఆయన అన్నారు. టీవీ చానెళ్ల వల్ల సమస్య తలెత్తుతోందని ఆయన అన్నారు. రాష్ట్ర రాజకీయాల గురించి తాను నాయకులతో మాట్లాడలేదని ఆయన అన్నారు. రాష్ట్రంలోని ప్రతి పరిణామాన్ని అధిష్ఠానం జాగ్రత్తగా గమనిస్తోందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రోశయ్యతో తాను రాష్ట్ర రాజకీయాల గురించి చర్చించలేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+