బాల్కో ప్రమాదంలో 31 మంది మృతి

గాయపడినవారిని అంబులెన్స్ ల ద్వారా అస్పత్రికి తరలిస్తున్నారు. కార్మికులను రక్షించడానికి చేయాల్సిందంతా చేస్తున్నామని ఆయన అన్నారు. ఇప్పటి వరకు పది మృతదేహాలను వెలికి తీసినట్లు ఆయన తెలిపారు. శిథిలాలను తొలగించడానికి రెండు రోజులు పడుతుందని ఆయన చెప్పారు. చిమ్నీ కూలిపోయిన వెంటనే 150 నుంచి 200 మంది కార్మికులు బయటకు పరుగులు తీశారు. శిథిలాల కింద ఇంకా 40 మందికి పైగా కార్మికులు చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. సంఘటనపై ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించింది.












Click it and Unblock the Notifications