రాహుల్ గాంధీ పర్యటనపై మాయావతి గుర్రు

రాహుల్ గాంధీ పర్యటన గురించి తెలిసిన వెంటనే రాష్ట్ర అధికారులు ఆరు గంటల పాటు ఆయన ఆచూకీని కనుక్కోవడానికి నానా తంటాలు పడ్డారు. కానీ లాభం లేకపోయింది. రాహుల్ గాంధీ విమానాశ్రయంలో కొంత మంది చూడడంతో విషయం బయటకు పొక్కింది. ఇన్నోవాలో రాహుల్ తన ఎస్పీజీ ద్వారా ప్రయాణించారు. సాయంత్రం నాలుగు గంటలకు బారాబంకి జిల్లాలోని రాంనగర్ లో రాహుల్ కనిపించారు. ఆ తర్వాత బహ్రెయిచ్ లో దర్శనమిచ్చారు. రోడ్డు పక్కన ఉన్న గ్రామస్థులతో మాట్లాడి మున్షీగంజ్ వైపు వెళ్లారు.












Click it and Unblock the Notifications