హైదరాబాద్: దసరా శరన్నరాత్రుల్లో భాగంగా తొమ్మిదవ రోజు ఆది వారం ఆశ్వయుజ శుద్ధ నవమినాడు అమ్మవారు శ్రీ మహిషాసురమర్ధినిగా భక్తులకు దర్శనమిచ్చారు. శర న్నవరాత్రులలో ఆఖరి రోజు నవమి. దీన్నే మహార్నవమి అని కూడా అంటారు.చండీ సప్తశతిలో మహాలక్ష్మీ రూపిణి అయిన దుర్గాదేవి అష్ట భుజాలతో, దుష్టరాక్షసు డైన మహిషాసురుని సంహరించి లోకోపకారం చేసిన ఘట్టం వర్ణితమైంది.పసుపు పట్టుచీర కట్టుకొని పాశాంకుశాలు ధరించి, ఒక చేతిలో త్రిశూలం కలిగి వుంటుంది.సింహాసనంపై ఆసీనురాలై ఉగ్రరూపంతో భక్తులకు దర్శనమిస్తుంది