జగన్ కు సిఎం పదవి కల్లే

ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ నిర్వహిస్తున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అడ్డుకోవడం తప్పని ఆయన అన్నారు. నల్లకాలువ సభలో వైయస్ జగన్ కనీసం కాంగ్రెసు పేరైనా ప్రస్తావించి ఉంటే బాగుండేదని ఆయన అన్నారు. వైయస్ భౌతిక కాయానికి అంత్యక్రియలు కూడా జరగకుండానే వైయస్ జగన్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలంటూ లాబీయింగ్ చేయడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పూర్తి స్థాయి ముఖ్యమంత్రి, మంత్రులు ఉన్నారని, ముఖ్యమంత్రిగా రోశయ్య సమర్థవంతంగా పని చేస్తున్నారని తాను చేసిన ప్రకటనకు కట్టుబడి ఉంటానని ఆయన అన్నారు.
కాగా, రోశయ్యకు క్రమక్రమంగా మద్దతు పెరుగుతోంది. తెలంగాణ సీనియర్ నాయకులు రోశయ్యకు తమ మద్దతు తెలిపారు. శనివారం సాయంత్రం సమావేశమై వారు రోశయ్యను సమర్థించారు. ఈ విషయాన్ని సీనియర్ కాంగ్రెస్ నేత పాల్వాయి గోవర్దన్ రెడ్డి వెల్లడించారు. ఈ స్థితిలో శనివారం సాయంత్రం కెవిపి రామచందర్ రావు, పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ముఖ్యమంత్రి రోశయ్యను కలుసుకున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అడ్డుకోవద్దని కెవిపి కార్యకర్తలను కోరారు.












Click it and Unblock the Notifications