హైదరాబాదు: ముఖ్యమంత్రి రోశయ్య ఇంట్లోకి బలవంతంగా చొరబడటానికి ప్రయత్నించిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారు ఆ సమయంలో పూర్తిగా త్రాగి ఉన్నట్లు సమాచారం. అంతేగాక వారు సిఎం ఇంటివద్ద నానా రబస సృష్టించినట్లు సమాచారం. అయితే వారు ఆకతాయిగా ఈ పనిచేశారా? లేక దీని వెనక ఏదైనా కుట్ర ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.