వరద బీభత్సానికి నాగులదిన్నెలో 45 మంది గల్లంతు

పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు గేట్లు తెరుచుకోవడం లేదు. దీంతో పరిస్థితి ప్రమాదకరంగా పరిణమించింది. ఎస్ఆర్ఎం కాలువకు గండి పడింది. కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాలకు 120 సైనిక బలగాలను పంపాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. కర్నూలు జిల్లాకు 4 హెలికాప్టర్లు, మహబూబ్ నగర్ జిల్లాకు రెండు హెలికాప్టర్లు పంపారు. రెండు జిల్లాలకు కలిపి ఆరు పవర్ బోట్లను కూడా నియోగించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎగువ ప్రాంతాలకు తరలిపోతున్నారు. హెలికాప్టర్ల ద్వారా ప్రజలను సురక్షితంగా తరలిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరా రెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications