వరదలో చిక్కుకున్నవారిని హెలికాప్టర్లతో రక్షిస్తాం: రఘువీరా

ఇంత ప్రమాదం ఇంతకు ముందు ఎప్పుడూ సంభవించలేదని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. కర్నూలుకు వరద ప్రమాదం ఇంకా తొలగి పోలేదని ఆయన అన్నారు. విజయవాడలోని లోతట్టు ప్రాంతాలు వరదలో మునిగిపోయే ప్రమాదం ఉందని, ప్రజలు ఎగువ ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఆయన అన్నారు. ప్రభుత్వ హెచ్చరికలని ఆషామాషీగా తీసుకోవద్దని ఆయన ప్రజలను కోరారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ ముప్పు పొంచి ఉందని ఆయన చెప్పారు. కర్నూలు జిల్లాలో నాలుగు, మహబూబ్ నగర్ జిల్లాలో రెండు గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. సహాయ చర్యల కోసం బెంగుళూరు నుంచి ఆరు హెలికాప్టర్లు బయలుదేరాయి.












Click it and Unblock the Notifications